తలపే కలిగించావే ,తపనే రేగించావే . తప్పుల్లో నేనున్నా సరే ,తీరులే మార్చేసావే . తపమే నే చేసానే ,తొలివలపే నాలో కలిగాకే . తాపీగా ఉండే నన్నే నువ్వు ,తుఫానే అయ్యే లా చేసావే . తలమునకలే అయ్యేలా ,తూర్పు పడమర ఏదో మరిచానే . తూట్లెన్నీ పడుతున్నా సరే ,తుంచి పొన్నంటోంది నా ప్రేమలే . తికమకలే పెడుతోంది రా ,తెలియని హాయి ఏదో ఇలా . తారాస పడిపోయింది ,తలకుల బెళుకుల నా చెలి . తిప్పలు పడుతున్నా,తనని చేరే మర్గానికై. తను ఉంటే నే తారస్తాయి కి చేరిపోతానులే . తొందర పెడుతోంది నా మది తోచింది ఏదో చేపెయిమంటూ . తావేలేదు అనిపిస్తోంది రా ,తప్పదు అంటోంది మనస్సే ఇలా . తరుణోపాయం ఎముంటదో అది, తాత్కాలికం కాకుండాలే .